Bhatti vikramarka: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడం. ప్రభుత్వం 42% ఓబీసీ (బీసీ) రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
ఈ అంశంపై ప్రభుత్వం వచ్చే నెల బడ్జెట్ సమావేశాల్లో చట్టం రూపొందించి పంపించనున్నట్లు ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టు సూచనలు, చట్టపరమైన అంశాలపై స్పష్టత వచ్చాకే ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.”42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు కట్టుబడి ఉన్నాం” అని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.