Bhatti vikramarka: విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కనెక్షన్లు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ – “ప్రజల ప్రాణాలతో చెలగాటం సరైంది కాదు. ఇప్పటికే ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదు. ఇకపై ఎవరు అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
అధికారులు వెంటనే కేబుల్ వైర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ చర్య వల్ల విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న వైర్ల కారణంగా కలుగుతున్న ప్రమాదాలు తగ్గుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.