Bharat Summit-2025:ప్రపంచ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఈ ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్-2025 సదస్సు జరగనున్నది. అలీనోద్యమానికి పునాది వేసిన చారిత్రాత్మక బాండుంగ్ సమావేశం 70 వార్షికోత్సవానికి పురస్కరించుకొని సమృద్ధి భారత్ ఫౌండేషన్‌తో కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Bharat Summit-2025:ఈ సదస్సులో ప్రపంచంలోని 100 దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. 100 రాజకీయ పార్టీల తరఫున 40 నుంచి 50 మంది మంత్రులు, 50 మంది వరకు సెనేటర్లు, ఎంపీలతోపాటు రాజకీయ పార్టీల అధినేతలు పాల్గొంటారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సునకు సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
Bharat Summit-2025:ఈ సదస్సులో భాగంగా ప్రపంచ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం, ద్వైపాక్షిక బంధాలపై చర్చలు జరగనున్నాయి. ప్రారంభంరోజైన 25వ తేదీన వివిధ రాజకీయ పక్షాల నేతలతోపాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత రాహుల్‌గాంధీ కీలకోపన్యాసం చేస్తారని తెలిసింది. ఈ సదస్సులోనే కాంగ్రెస్ కీలక నేతలైన మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొంటారని తెలిసింది.

