Bharat Bandh: జూన్ నెల 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఆ పార్టీ ఈ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా జూన్ 11 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని అదే ప్రకటనలో పేర్కొన్నారు.
Bharat Bandh: 2026 మార్చి నెల నాటికి దేశంలో మావోయిస్టులు అనే వాళ్లే లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఆ మేరకు ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్ పేరిట మావోయిస్టులను, వారిలో కీలక నేతలను సైతం భద్రతా దళాలు హతమారుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.
Bharat Bandh: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవులు మావోయిస్టులకు సురక్షిత ప్రాంతాలుగా ఉన్నాయి. అయితే భద్రతా దళాలు ఆ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అటవీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి, దట్టమైన అడవుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులను మట్టుబెడుతూ ముందుకు సాగుతున్నాయి.
Bharat Bandh: ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో మావోయిస్టు కేంద్ర కమిటీ జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నది. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ భారత్ బంద్ చేపడుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా వెల్లడించారు.

