Bharat Bandh:

Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?

Bharat Bandh: ఫిబ్రవరి 12, 2026 (గురువారం) నాడు దేశవ్యాప్తంగా వివిధ కార్మిక ఇంకా రైతు సంఘాలు ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన నూతన కార్మిక కోడ్‌లు (Labour Codes) భారత్-అమెరికా మధ్య కుదిరిన వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఈ సమ్మెకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు పనిచేస్తాయా లేదా అన్న గందరగోళం సామాన్య ప్రజల్లో నెలకొంది.

బ్యాంకులు తెరిచి ఉంటాయా? మూసి ఉంటాయా?

సాంకేతికంగా ఫిబ్రవరి 12ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గానీ, ప్రభుత్వం గానీ అధికారిక సెలవుగా ప్రకటించలేదు. కాబట్టి బ్యాంకులు అధికారికంగా తెరిచే ఉంటాయి. అయితే, ఈ క్రింది అంశాలను గమనించడం ముఖ్యం:

  • యూనియన్ల సమ్మె: AIBEA, AIBOA, BEFI వంటి ప్రధాన బ్యాంక్ యూనియన్లు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (SBI, PNB, BoB) సిబ్బంది కొరత ఏర్పడి, కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
  • ప్రైవేట్ బ్యాంకులు: HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో యూనియన్ల ప్రభావం తక్కువ కాబట్టి అక్కడ కార్యకలాపాలు దాదాపు యథావిధిగా కొనసాగుతాయి.

ఏ సేవలకు అంతరాయం కలగవచ్చు?

బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి చేసే పనులపై ఈ సమ్మె ప్రభావం ఉండవచ్చు.

  • నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్  కౌంటర్ వద్ద ఎంప్లాయిస్ ఉండకపోవొచ్చు.
  • చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్ (DD) జారీ చేయడంలో కొంత అలసహం ఉండవొచ్చు.
  • కొత్తగా లోన్ తీసుకోవాలి బ్యాంకు కి వచ్చే వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ కి సమయం పాటవోచు  ఇంకా పాస్‌బుక్ అప్‌డేట్స్ కి ఎక్కువ సమయం తీసుకోవొచ్చు.  
  • డిజిటల్ బ్యాంకింగ్: ఏటీఎంలు (ATMs), నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు యూపీఐ (UPI) సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా 24/7 పనిచేస్తాయి.

ఎందుకు ఈ బంద్? 

  1. కార్మిక చట్టాలు: 29 పాత చట్టాలను రద్దు చేసి కేంద్రం తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరిస్తున్నాయని యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
  2. అమెరికా ట్రేడ్ డీల్: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల విదేశీ ఉత్పత్తులు దిగుమతి అయి, దేశీయ రైతులు, పాడి పరిశ్రమ దెబ్బతింటుందని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
  3. వారానికి 5 రోజుల పని: బ్యాంకు ఉద్యోగులు దీర్ఘకాలంగా కోరుతున్న 5-డే బ్యాంకింగ్ వారానికి ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *