Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ లో ఎపుడు జరగని విధంగా ఈ సీజన్ లో జరుగుతుంది. అసలు ఊహించని మలుపులతో ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇటీవల హౌస్ నుంచి అయేషా అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో, ఆమె ప్లేస్‌లో పర్మినెంట్ మెంబర్ ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ అయిన భరణి మరియు శ్రీజ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ రీ-ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ వీరిద్దరిలో ఒకరే హౌస్‌లో ఉంటారని ప్రకటించి, రెండు టీమ్స్ ఏర్పాటు చేసి, గెలిచిన వారే పర్మినెంట్ మెంబర్ అవుతారని టాస్క్‌లు ఇచ్చారు.
టాస్క్-1: కట్టు-పడగొట్టు వివాదం
ముందుగా ‘కట్టు-పడగొట్టు’ అనే మొదటి టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇరు జట్ల సభ్యులు టవర్‌ను నిర్మించడం, ప్రత్యర్థి టవర్‌ను పడగొట్టడం చేయాలి.
- భరణి టీం: నిఖిల్, ఇమ్మానుయేల్
- శ్రీజ టీం: డీమాన్, గౌరవ్
టాస్క్ హోరాహోరీగా సాగింది. భరణి డీమాన్‌ను ఆపడానికి ప్రయత్నించగా, నిఖిల్ గౌరవ్‌ను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో పవన్ జోక్యం చేసుకుని నిఖిల్, భరణి ఇద్దరినీ ఉడుంపట్టు పట్టాడు.
శ్రీజ తన టవర్‌ను పూర్తి చేసినప్పటికీ, బజర్ మోగే చివరి క్షణంలో భరణి శ్రీజ టవర్‌ను కాలితో తన్ని టవర్ వాక్స్ (నిర్ణీత గీత) లో లేకుండా చేశాడు. విన్నర్ ఎవరో తేల్చడానికి సంచాలక్‌లుగా ఉన్న సుమన్ శెట్టి (భరణి గెలిచాడని), కళ్యాణ్ (శ్రీజ గెలిచిందని) గొడవ పడ్డారు. దాంతో బిగ్ బాస్ వారిద్దరూ విఫలం అయ్యారని ప్రకటించాడు.
ఇది కూడా చదవండి: Khammam: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. పోటెత్తిన మున్నేరు.. ఖమ్మం లో హై అలర్ట్
గెలిచిన వారిని తేల్చడానికి భరణి, శ్రీజ ఇద్దరూ కలిసి మరొక కంటెస్టెంట్‌ను సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ అనడంతో, శ్రీజ ఊహించని విధంగా మాధురి పేరు చెప్పింది. మాధురి షాకైనా, చివరకు శ్రీజ గెలిచింది అని ప్రకటించింది.
గాయపడిన భరణి, తాజా సమాచారం
ఆతర్వాత జరిగిన రెండో రౌండ్‌లో ఇమ్మానుయేల్ తరఫున రాము, భరణి పోటీ పడ్డారు.
ఒకరిని ఒకరు ఆపే క్రమంలో ఇద్దరూ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయారు. ఈ ఘటనలో భరణికి గాయం కావడంతో చికిత్స కోసం హౌస్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో రెండో రౌండ్‌లోనూ ఎవరూ గెలవలేదు. గాయానికి చికిత్స తీసుకున్న భరణి తాజాగా హౌస్‌లోకి తిరిగి వచ్చాడు. గాయం తర్వాత జరిగిన తదుపరి టాస్క్‌ల్లో భరణి రెండు టాస్క్‌లు గెలవగా, శ్రీజ ఒక టాస్క్ మాత్రమే గెలిచిందని తెలుస్తోంది.
అంతిమ విజేత భరణి
అన్ని టాస్క్‌ల తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భరణినే బిగ్ బాస్ హౌస్‌లో పర్మినెంట్ మెంబర్‌గా నిలిచాడు. శ్రీజ మరోసారి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. భరణి పర్మినెంట్ కంటెస్టెంట్‌గా మారడంతో హౌస్‌లో అతని ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారనుంది.

