Bhairavam

Bhairavam: భైరవం సంచలనం గ్లోబల్ నెంబర్ 1!

Bhairavam: విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో రూపొందిన భైరవం సినిమా థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటనతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. తమిళ హిట్ గరుడన్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో స్నేహం, ద్రోహం, యాక్షన్ కలగలిపిన కథాంశం ఉంది. దేవిపురం గ్రామంలో జరిగే ఈ కథలో ముగ్గురు స్నేహితుల బంధం, రాజకీయ కుట్రలు, ఆలయ సంపదపై కన్నేసిన శత్రువుల చుట్టూ తిరుగుతుంది. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కీలక పాత్రల్లో నటించగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అదనపు ఆకర్షణ. కెకె రాధామోహన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో భారీ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *