Bhagyashri Borse: నర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో నటిస్తున్న యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రేమ వివాహమే చేసుకుంటా!
యాంకర్ అడిగిన ప్రశ్నకు భాగ్యశ్రీ ఏమాత్రం తడుముకోకుండా, చాలా క్లారిటీగా, బోల్డ్‌గా సమాధానం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అన్న ప్రశ్నకు.. “కన్ఫర్మ్గా లవ్ మ్యారేజే చేసుకుంటా,” అని బదులిచ్చింది. అయితే, ప్రస్తుతం ప్రేమలో ఉన్నారా? అని ప్రశ్నించగా, వెంటనే లేను అని సమాధానం ఇచ్చింది. ప్రేమలో లేనప్పటికీ లవ్ మ్యారేజ్ ఎందుకు అని అడగగా, “నాకు ప్రేమ మీద విపరీతమైన విశ్వాసం ఉంది. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుని, నచ్చే వ్యక్తి నా జీవితంలోకి వస్తాడనే నమ్మకం ఉంది. అందుకే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను,” అని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది.
ఇది కూడా చదవండి: TS News: తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు.. అమెజాన్ తో ఒప్పందం..!
ప్రేమ విషయాన్ని దాస్తున్నారేమో?
భాగ్యశ్రీ ఇచ్చిన ఈ దృఢమైన సమాధానం సినీ వర్గాల్లో, అభిమానులలో కొత్త చర్చకు తెర తీసింది. లవ్ మ్యారేజ్ పై ఆమెకున్న అంతటి దృఢమైన నమ్మకం చూస్తుంటే.. కెరీర్ కోసం ప్రేమ విషయాన్ని దాస్తున్నారేమో అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఒక అమ్మాయి అప్పటికే ప్రేమలో ఉంటే తప్ప, పెళ్లి గురించి అంత కచ్చితంగా ప్రేమ వివాహమే అని చెప్పదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను దాచడానికి ప్రయత్నించడం సర్వసాధారణంగా మారింది కాబట్టి, బహుశా భాగ్యశ్రీ కూడా తన రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పై ఆశలు
తాను ప్రేమ వివాహం చేసుకునేది కన్ఫర్మ్ అని చెప్పిన భాగ్యశ్రీ, అది ఎప్పుడు, ఏంటి అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ రామ్ పోతినేనితో నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాపైనే ఉన్నాయి. నవంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రం, వరుసగా రెండు ఫ్లాప్‌ల తర్వాత వస్తుండడంతో ఆమె కెరీర్‌కు కీలకం కానుంది.
సినిమా విడుదల కాకముందే, తన వ్యక్తిగత జీవితంపై భాగ్యశ్రీ చేసిన ఈ బోల్డ్ స్టేట్మెంట్ ఆమెకు మరింత హైప్‌ను తెచ్చిపెట్టింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం ఏంటో, భాగ్యశ్రీ బోర్సే ప్రేమ విషయం ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి.
