Betting Racket

Betting Racket: బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు .. 24 మంది అరెస్ట్

Betting Racket: వాళ్ళు చేసిన తప్పేంటి. అంతరించించిపోతున్న ఆటలను ప్రోత్సహహించారు అంతే. ఆ మాత్రానికే కేసులు పెడతారా ? ఎదో నాలుగురికి తెలియకుండా …నాలుగు గోడల మధ్య ఆడుకుంటున్నారు. ఆ మాత్రానికే అరెస్ట్ చేస్తారా ? పాపం ఆ ఆటగాళ్లు ..ఇలా దొరికిపోయారు. అంటే వాళ్ళు ఆడే ఆ ఆట పాతదే అయినా …పర్మిషన్ లేదు అంతే. ఎవరికీ తెలివి తేటలకు తగ్గట్టు ఎదుటి వ్యక్తిని మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. ఇలా ఎంత మంది వీరి చేతిలో మోసపోయారో…

సట్టా బెట్టింగ్ నిర్వహిస్తున్న రాకెట్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, షాహినాయత్ గంజ్ పోలిసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 24 మందిని అరెస్టు చేసి వారి వద్ద 30,760 రూపాయల సొత్తు తో పాటు సట్టా,లాటరీ చిట్స్,15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Betting Racket: జుమ్మేరాత్ బజార్ కి చెందిన విశాల్ సింగ్ గణేష్ విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.కాగా తనకు వచ్చిన సంపాదన సరిపోక పోవడం తో సులభంగా డబ్బులు సంపాదించేందుకు సట్టా బెట్టింగ్‌ గేమింగ్‌ హౌస్‌ను నిర్వహించేందుకు ప్లాన్‌ వేశాడు.ఈ క్రమంలో 4గురు ఆర్గనైజర్లతో కలిసి ఆటో డ్రైవర్లు, కార్మికులు, హోటల్ కార్మికులు మొదలైన వారిని లక్ష్యంగా చేసుకున్నాడు.

ఈ గేమ్ ఆడటం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు అన్ని వారికి ఆశ చూపించి జుమ్మెరాత్ బజార్ లో విక్కీ పాన్ షాప్ వెనకాల ఓ గదిని తీసుకున్నాడు. కాగా గేమింగ్ కు అలవాటు పడిన ఫాంట్లతో కలిసి ఆ గదిలో సట్టా నిర్వహిస్తున్నాడు.

Betting Racket: సమాచారం అందుకున్న కమీషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ టీమ్ షాహినాయత్‌గంజ్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించి విశాల్ సింగ్, నరేష్ కుమార్ చౌహాన్,అనికేత్ సింగ్,అక్షయ్ సింగ్, ఆర్గనైజర్ తో పాటు మరో ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.30760, సట్టా చిట్స్, లాటరీ చార్ట్, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *