Betting Effect: బెట్టింగ్ భూతానికి తెలంగాణ రాష్ట్రంలో మరో యువకుడు బలయ్యాడు. ఇప్పటికే బెట్టింగ్‌కు బానిసగా మారి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నా మానలేకపోయాడు. బెట్టింగ్ యాప్‌లతో నష్టాలొచ్చి, అప్పులపాలై మనస్తాపంతో పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకుడు తనువు చాలించాడు. ఇలా వరుస ఆత్మహత్యలతో ఆందోళన నెలకొన్నది.
Betting Effect: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ టీ2-185 క్వార్టర్‌లో వేముల విజయ, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులు. వారి చిన్న కొడుకు వేముల వసంత్‌కుమార్ (27) ఆర్టీ-3 ఏరియా ఎసీపీ-2 పరిధిలోని సీ-5 కంపెనీలో వోల్వో ఆపరేటర్‌గా పనిచేస్తన్నాడు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు.
Betting Effect: బెట్టింగ్ యాప్‌ల బారిన పడిన వసంత్‌కుమార్ తొలుత రూ.4 లక్షల వరకు నష్టపోయాడు. వాటిని అప్పుగా తెచ్చి బెట్టింగ్ పెట్టాడు. అదంతా పోవడంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి రాసాగింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఎలాగోలా ఆ రూ.4 లక్షలను తండ్రి తీర్చి బుద్ధులు చెప్పాడు. ఇక నుంచి ఆడనని మాటిచ్చాడు.
Betting Effect: కానీ, మళ్లీ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. దాని నుంచి బయటపడలేకపోయాడు. ఈ సారి కూడా తీవ్రంగా నష్టాలపాలయ్యాడు. బెట్టింగ్‌లో అంతా పోగొట్టుకున్నాడు. ఈ సారి మరికొందరి వద్ద అప్పుదెచ్చి బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరికీ చెప్పుకోలేక మదనపడ్డాడు. ఇంట్లో తెలిస్తే ఈసారి ఊరుకోరని భావించాడు.
Betting Effect: ఈ దశలో వసంత్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు చావే గతి అనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ వలలో బలయ్యాడు. ఇలా ఇంకెంత మంది బలి కావాలి. ఆఫ్‌లైన్ జూదాలు రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ జూదాలు యువతను చెడగొడుతున్నాయి.