Betting App Case: బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ బెట్టింగ్ యాప్ కేసులో మనీలాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా సినీ ప్రముఖుల పాత్రపై ఆరా తీస్తోంది. తాజాగా నోటీసులు అందుకున్న వారిలో స్టార్ హీరోలు, సీనియర్ నటులు ఉన్నారు.
ఈడీ జారీ చేసిన నోటీసుల ప్రకారం, విచారణకు హాజరుకావాల్సిన తేదీలు ఇలా ఉన్నాయి:
జూలై 23న: ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి
జూలై 30న: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్
ఆగస్టు 6న: యువ సంచలనం విజయ్ దేవరకొండ
ఆగస్టు 13న: నటి మంచు లక్ష్మి
వీరందరూ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరై, ఈ కేసులో తమకు తెలిసిన సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో డ్రగ్స్ కేసులోనూ సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బెట్టింగ్ యాప్ కేసులోనూ సెలబ్రిటీల పేర్లు బయటకి రావడంతో టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.