Telangana: ఖమ్మం నగరంలో ఓ యువకుడు బెట్టింగ్‌ల బారిన పడిపోయి తన ప్రాణాలను తీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన ఎండీ మొహినుద్దీన్ దంపతుల కుమారుడు ఎండీ అజీజుద్దీన్ (27) చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరిచాడు. తన కుటుంబ ఆర్థిక స్థితిని అధిగమించి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పొందాడు.
ఉద్యోగం చేసే కాలంలో అజీజుద్దీన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. మొదట్లో చిన్న మొత్తాలు పెట్టి ఆడిన అతను, తర్వాత అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్‌లో మునిగిపోయాడు. కానీ ఆశించిన విధంగా డబ్బులు రావడం మానేసి, చేసిన అప్పులు పెరిగిపోవడంతో కష్టాల్లో కూరుకుపోయాడు.
అతని తండ్రి మొహినుద్దీన్ కొడుకును ఆదుకునేందుకు రూ.5 లక్షలు చెల్లించినా, అప్పుల భారం తగ్గలేదు. ఆ తర్వాత అజీజుద్దీన్ మరోసారి బెట్టింగ్‌లకు గట్టిగా నష్టపోయి రూ.22 లక్షల వరకు అప్పులు చేసుకున్నాడు. అప్పులవాళ్ల ఒత్తిడి అధికంగా రావడంతో నాలుగు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఖమ్మానికి తిరిగొచ్చాడు.
ఇది కూడా చదవండి: NTR New Movie: ఎన్టీఆర్ సినిమా విషయంలో KGF స్ట్రాటజీని ఫాలో అవుతున్న నీల్!
ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలని తండ్రిని కోరినా, కొంత సమయం కావాలని చెప్పారు. అయితే, ఒత్తిడిని తట్టుకోలేక నిన్న అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి వీడియో సందేశం పంపాడు.
వెంటనే తల్లిదండ్రులు అక్కడికి చేరుకునేలోపు, అజీజుద్దీన్ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై ఖానాపురం హవేలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయా