Throat Pain: చలికాలం ప్రారంభం కాగానే చాలా మంది జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చలికాలంలో అధిక పొడి గాలి గొంతులోని శ్లేష్మ పొరలను ఎండిపోతుంది. దీని వల్ల గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఈ సమయంలో విటమిన్ డి కూడా ఎక్కువగా లభించదు. అందువల్ల రోగనిరోధక శక్తి తగ్గి గొంతు సమస్యలు వస్తాయి.
గొంతు నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని ఉప్పు నీటిని తాగి పుక్కిలించండి. ఇది గొంతు నుండి కఫం, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించండి. గంటకోసారి ఇలా చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
Throat Pain: నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా గొంతు నొప్పిని తగ్గిస్తుంది. నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగండి. దీనికి కొద్దిగా తేనె లేదా చిటికెడు ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇది గొంతును తేమగా ఉంచుతుంది.
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో పావు టీస్పూన్ బేకింగ్ సోడా మరియు చిటికెడు ఉప్పు కలిపిన ద్రావణంతో పుక్కిలించండి. ఈ చిట్కాను వీలైనన్ని సార్లు ప్రయత్నించండి. యాపిల్ సైడర్ వెనిగర్ గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి నెమ్మదిగా త్రాగాలి. రుచి కోసం తేనెను కూడా కలుపుకోవచ్చు.
