Lung Health

Lung Health: మీ ఊపిరితిత్తులు హెల్తీగా ఉండాలంటే..ఈ పండ్ల తప్పక తినాలి

Lung Health: మన శరీరంలోని ప్రతి భాగం సరిగ్గా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. మన రోజువారీ ఆహారపు అలవాట్లను కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ప్రతిరోజూ కొన్ని సహజ ఆహారాలు తీసుకోవాలి. వాటిలో పండ్లు మంచి ఎంపిక. ఈ పండ్లలో కొన్ని ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వాటి పనితీరును మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మరి ప్రతిరోజూ ఎలాంటి పండ్లు తినడం మంచిది? ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..

Lung Health

అనాస పండు
ఈ పండులో బ్రోమెలైన్ అనే సహజంగా లభించే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల వాపును నియంత్రిస్తుంది. శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని మాంగనీస్ వంటి మినరల్స్ కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

Lung Health

బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పండు తినడం ద్వారా మీరు మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పునరావృతమయ్యే అనారోగ్య సమస్యలను నివారించవ.చ్చు ఎందుకంటే దీని ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి.

Lung Health

కివి
ఈ పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కివి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.

Lung Health

స్ట్రాబెర్రీ
ఇందులో కణజాలాలను రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను అరికడతాయి.

Lung Health

పుచ్చకాయ
వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది ఊపిరితిత్తులకు చాలా మంచిది. ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ సి వంటి పోషకాలు అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో తేమ నిలిచి ఉండి, వాపు తగ్గుతుంది.

Lung Health

మామిడి పండు
మామిడిపండు సాధారణంగా అందరికీ ఇష్టం. ఇందులో బీటా-కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

Lung Health

దానిమ్మ
ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూలకాలు ఊపిరితిత్తుల కణాలను బలోపేతం చేస్తాయి. వాతావరణంలోని హానికరమైన వాయువుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. అందువల్ల, దానిమ్మ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

Lung Health

నారింజ
ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్ లు, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షిస్తుంది. నారింజ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *