Viral News: ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యలో ఒక కోడి పెద్ద చిచ్చే పెట్టింది. దాని దెబ్బకు ఒకరికి ఒకరుగా కలిసి మెలిసి ఉండే ఇద్దరు వ్యక్తులు కొట్టుకునే దాకా పరిస్థితి వచ్చింది. ఆ స్టోరీ ఏమిటో చూద్దాం.
పల్లిక్కల్ గ్రామం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఉంది. ఇక్కడ రాధాకృష్ణన్ అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. ఆయన ఇంటిపక్కనే అనిల్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. చాలా ఏళ్లుగా ఈ ఇద్దరూ స్నేహితులుగా ఉంటున్నారు. అయితే, ఇటీవల ఒక కోడి కారణంగా ఇద్దరి స్నేహం దెబ్బతిన్నది. ప్రాణ స్నేహితులు కాస్తా.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే లాంటి పరిస్థితి ఏర్పడింది.
అనిల్ కుమార్ ఇంట్లో పెంచిన కోడి ప్రతి ఉదయం 3:00 గంటలకు ఆగకుండా కూస్తూ వస్తోంది. దీనివలన రాధాకృష్ణన్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. వృద్ధాప్యం.. పైగా నిద్ర పట్టె సమయంలో పక్కింటి నుంచి కోడి కూతలు.. రాధాకృష్ణకు నిద్రలేమి రాత్రులను మిగులుస్తున్నాయి. అందుకే, దీనిపై అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది.
ఇది కూడా చదవండి: Water Crisis: వామ్మో కార్లు కడిగినా.. మొక్కలకు నీళ్లు పోసినా జరిమానా!
దీంతో, కోడి కూయడం వల్ల తన నిద్రకు ఇబ్బంది కలుగుతోందని ఆరోపిస్తూ రాధాకృష్ణన్ అరూర్ రెవెన్యూ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. మానవతా ధృక్ఫదంతో దీనికి సంబంధించి రాధాకృష్ణన్, అనిల్ లతో చర్చలు జరిపారు.
తరువాత, వారు అనిల్‌కుమార్ ఇంటిని సోదా చేశారు. పై అంతస్తులో ఉంచిన కోడి కూస్తున్నదని, దీనివల్ల రాధాకృష్ణన్ ఇబ్బంది పడుతున్నారని.. వారు నిర్ధారించారు. దీని తరువాత, పై అంతస్తులో ఉంచిన కోడిని రాబోయే 14 రోజుల్లో ఇంటి దక్షిణ మూలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. అనంతరం క్లారిటీ ఇస్తామని సంబంధిత వ్యక్తులకు చెప్పారు.ఈ విషయం విన్న స్థానికులు కోడి కోసం స్నేహాన్ని చంపేసుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.