BengaluruNews: రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడుతున్నది. రీల్స్ మాయలో పడిన యువతకు ముందు వెనుకా ఆలోచనే ఉండటమే లేదు. తర్వాత ఏం జరుగుతదో అన్న భయమూ కలగడం లేదు. రీల్స్ బాగా వస్తుందా? రావడం లేదా? అన్నదే వారికి ముఖ్యం. తాము ప్రమాదంలో ఉన్నామనే విషయాన్నే కొందరు గ్రహించలేక పోతున్నారు. ఇలా ప్రాణాలమీదికి కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి కోవలోనే బెంగళూరులో ఓ యువతి 13వ అంతస్థుపై నుంచి పడి ప్రాణాలు తీసుకున్నది.
BengaluruNews: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు పరిధిలోని అగ్రహారాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కొందరు కలిసి పార్టీ చేసుకున్నారు. అంతా సవ్యంగా పార్టీలో మునిగి తేలుతున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. అందరూ ఫంక్షన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఫంక్షన్ మోజులో ఉండగా, ఓ యువతి మాత్రం తన మోజు తీర్చుకునే పనిలో పడింది.
BengaluruNews: ఒకవైపు పార్టీ కొనసాగుతుండగా, రీల్స్ చేయాలనే ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా టెర్రస్ పైకి ఎక్కనే ఎక్కింది. ఆ టెర్రస్‌పై నడుస్తూ వీడియో తీసుకుంటుండగా, కాలుజారి 13వ అంతస్థుపై నుంచి కింద పడింది. అక్కడికక్కడే ఆ యువతి ప్రాణాలిడిసింది. ఈ హఠాత్పరిణామంతో పార్టీ చేసుకునే తోటి స్నేహితులంతా అక్కడి నుంచి పరారయ్యారు.
BengaluruNews: ఈ ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ యువతిది బీహార్ రాష్ట్రమని, నగరంలోని ఓ మార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నదని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు తరచూ జరిగి ఎందరో ప్రాణాలు కోల్పుతున్నా.. ఇలాంటి ఫీట్లను రీల్స్ చేసే యువత మానడం లేదు. ఇంత ప్రమాదకర రీల్స్ చేసి తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని పోలీసులు, మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.