Thief

Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు..

Thief: వీడు అసలు సిసలైన దొంగ. దొంగతనాలు చేయడం వృత్తయినా ..దొంగలించిన డబ్బుతో తన దొంగ ప్రేమికురాలి కోసం దొంగతనాల మీద దొంగతనాలు చేసాడు. రా ని కోసం ఓ విల్లా కొన్నాను అని …కాస్టలీ ఏరియాలో ఓ ఖరీదైన కొంపను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంతకీ ఈ దొంగ లవర్ ఎవరో తెలుసా ? ఆ ఏరియాలో ఒక టాప్ హీరోయిన్. అసలు దొంగ కు ఆ హీరోయిన్ కు ఎలా లవ్ మొదలయింది.

ప్రేమించిన ప్రియురాలి కోసం ఏకంగా ఓ దొంగ రూ. 3 కోట్లతో పెద్ద ఇల్లుని కట్టించాడు. దోచుకున్న డబ్బుతో లవర్‌ కోసం ఇలా చేశాడు. నిందితుడు 37 ఏళ్ల పంచాక్షరి స్వామిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఓ ప్రముఖ సినీ నటితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

నిందితుడు పంచాక్షర స్వామి మహారాష్ట్ర సోలాపూర్‌కి చెందిన వ్యక్తి. ఇతడికి అప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. స్వామి మైనర్‌గా ఉన్నప్పుడే 2003 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు విచారణలో తేలింది. 2009 నుంచి దొంగతనాలనే ఫుల్ టైమ్ వృత్తిగా మార్చుకున్నాడు. తన నేరాల ద్వారా కోట్ల విలువైన సంపదని కూడబెట్టాడు. 2014-2015లో ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరుకుని, ఆమెతో ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నాడు.

ఇది కూడా చదవండి: Suzuki Jimny Discount: Maruti suv పై లక్షల్లో తగ్గింపు.. బంఫర్ ఆఫర్

విచారణలో, ఆ నటి కోసం కోట్లు ఖర్చుపెట్టినట్లు ఒప్పుకున్నాడు. కోల్‌కతాలో రూ. 3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించి, ఆమెకు రూ. 22 లక్షల విలువైన అక్వేరియంని గిఫ్ట్‌గా ఇచ్చాడు. 2016లో, స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత, అతను తిరిగి దొంగతనాలను మళ్లీ ప్రారంభించాడు. పలు నేరాల కింద మహారాష్ట్ర పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. 2024లో విడుదలైన తర్వాత, తన మకాంని బెంగళూర్‌కి మార్చాడు. అక్కడే ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.

జనవరి 9న, అతను బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. నిఘా సమాచారం సేకరించిన తర్వాత, పోలీసులు మడివాలా మార్కెట్ ప్రాంతం సమీపంలో అతన్ని అరెస్టు చేశారు. విచారణలో, అతను తన సహచరుడితో కలిసి బెంగళూరులో నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చడానికి ఉపయోగించే ఇనుప రాడ్, ఫైర్ గన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఆభరణాలను మహారాష్ట్ర సోలాపూర్‌లోని తన ఇంట్లో నిల్వ చేసినట్లు స్వామి పోలీసులకు వెల్లడించారు.

ALSO READ  Prabhakar Rao: సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు హాజరు

అధికారులు 181 గ్రాముల బంగారు బిస్కెట్లను, 333 గ్రాముల వెండిని, ఇతర భరణాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాలు చేసిన తర్వాత స్వామి, అనుమానం రాకుండా రోడ్డుపైనే బట్టలు మార్చుకునే వాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఇతడికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. తండ్రి మరణం తర్వాత, అతడి తల్లికి రైల్వేలో ఉద్యోగం లభించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *