Bengaluru

Bengaluru: కాన్వెంట్ లో పార్ట్నర్ అంది.. హగ్ ఇచ్చింది.. లక్షలు గుంజేసింది!

Bengaluru: మోసం చేయడానికి రకరకాల దారులు. ఇటీవల కాలంలో అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి.. దోచుకోవడం ఎక్కువగా జరుగుతోంది. ముందు స్నేహం.. తరువాత మోహం.. ఈ వలలో చిక్కుకుని చివరకు లబోదిబో అనడం మోసపోయిన వారికి రివాజుగా మారిపోయింది. తాజాగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఒక కిలేడీ చేసిన మోసంలో లక్షలు కోల్పోయిన వ్యక్తి కథ వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌కు చెందిన రాకేష్ వైష్ణవ్ ఒక వ్యాపార వేత్త. అతని ముగ్గురు పిల్లలు ఇస్కాన్ ఆలయానికి సమీపంలో ఉన్న ‘ప్లే స్కూల్’లో చదువుకున్నారు. పిల్లలను స్కూల్ నుంచి తీసుకువచ్చే క్రమంలో రాకేష్ కు 25 ఏళ్ల టీచర్ శ్రీదేవి పరిచయం అయింది. ఇద్దరూ తరచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. ప్లే స్కూల్ విస్తరించడానికి నిర్వాహకులు డబ్బు అడుగుతున్నారని చెప్పి శ్రీదేవి రాకేష్ నుండి డబ్బు తీసుకుంది. తరువాత తన తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారని చెప్పి నాలుగు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది.

Bengaluru: గత సంవత్సరం మార్చిలో అప్పు తీర్చమని రాకేష్ శ్రీదేవిని అడిగాడు. దీంతో ఆమె అప్పు తీర్చలేనని.. కాన్వెంట్ లో భాగస్వామిగా చేరొచ్చని చెప్పింది. అలా రాకేష్ ఆ స్కూల్ లో పార్ట్నర్ అయ్యాడు. ఆ తరువాత శ్రీదేవికి బాగా దగ్గరయ్యాడు. సరసాలు మొదలయ్యాయి. ఇంకేముంది.. శ్రీదేవి అతనికి దగ్గరగా ఉన్నసమయంలో వీడియోలు తీసి పెట్టుకుంది. ఒకసారి రాకేష్ భార్య ఇంట్లో లేని సమయంలో శ్రీదేవి అతని ఇంటికి వచ్చి, అతన్ని ముద్దు పెట్టుకుని, అక్కడి నుంచి 50,000 రూపాయలు తీసుకుంది.

Also Read:  Narcotics Seized: హిందూ మహాసముద్రంలో 2,500 కిలోల డ్రగ్స్.. స్వాధీనం చేసుకున్న భారత నావికాదళం

జనవరి నెలలో రాకేష్ శ్రీదేవిని డబ్బులు అడిగాడు. అయితే, ఆమె డబ్బులు ఇవ్వకపోగా రాకేష్ తనతో ఉన్న వీడియోలు బయటపెడతానని బెదిరించడం ప్రారంభించింది. పైగా నువ్వు ఇచ్చిన డబ్బు ఇవ్వలేను. దానికి బదులుగా నాతొ ఆనందించు అని చెప్పింది. అంతేకాకుండా కోటి రూపాయలు ఇవ్వాలని అడిగింది. దీంతో రాకేష్ షాక్ అయ్యాడు.

Bengaluru: ఈ క్రమంలో శ్రీదేవి ప్రియుడు సాగర్, రౌడీ గణేష్ ల సహాయంతో రాకేష్ ను పెద్ద స్కెచ్ వేసింది. గత నెల 18న మహాలక్ష్మి లేఅవుట్ నుంచి కారులో రాకేష్‌ను ఈ ముగ్గురు వ్యక్తులు అపహరించారు. వారు అతని నుండి 1.90 లక్షల రూపాయలు లాక్కొని, గోరఖుండేపాళయ్య వద్ద అతన్ని దింపి పారిపోయారు. దీనిపై రాకేష్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న శ్రీదేవి, సాగర్, గణేష్ లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసును అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *