Bengaluru News: ఇదో రకమైన వేధింపులు అనాలా? శాడిజం అనాలో? కానీ ఓ వ్యక్తి తన భార్య నుంచి నిత్యం ఇలాంటి వేధింపులు అనుభవిస్తున్నాడు. ఉద్యోగం ఉన్నదని, పెళ్లి చేసుకొని హాయిగా గడపాలని అనుకున్న ఆ యువకుడికి ఇలాంటి షాక్ తగలడంతో విలవిల్లాడిపోవడంతో ఆ యువకుడి వంతయింది. కొన్నాళ్లు పోయాక తన భార్య మారుతుందని భావించిన ఆ యువకుడికి మూడేండ్లు గడిచినా నిరాశే మిగిలింది.
Bengaluru News: బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు 2022లో ఓ యువతితో వివాహమైంది. పెళ్లి రోజు నుంచి ఇప్పటివరకూ ఒక్కనాడు కూడా వారు సంసారం చేయలేదంటే నమ్మండి. పిల్లల్ని కందాం.. హాయిగా ఉందామని ఆ భర్త తన భార్యను అడిగితే ఆమె ఎలాంటి సమాధానం ఇచ్చిందో తెలుసా? 60 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దాం.. ఇప్పటివరకు ఎవరినైనా దత్తత తీసుకుందాం.. అని ఈజీగా అనేసిందట.
Bengaluru News: తన భార్యే కదా అని ముట్టుకోబోతే అంతెత్తు ఎగిరి గంతేసేదట. దీనికి ఆమె ఇచ్చిన సమాధానంతో ఆ యువకుడి నోట మాట కూడా రావడం లేదట. నన్ను ముట్టుకుంటే డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటా.. అని బెదిరించేది అని ఆ యువకుడు ఆవేదనతో చెప్పుకున్నాడు. ఒకవేళ తనను ముట్టుకోవాలని అనుకుంటే రోజూ రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెట్టింది. దీంతో ఆ యువకుడు ఆమెను ముట్టుకోవడమే మరిచాడు. ఇక సంసారం ఏం జేస్తాడు పాపం.
Bengaluru News: ఒళ్లు గగుర్పొడిచే ఆసక్తికర అంశం ఉన్నది. అదేమిటంటే? భర్త వర్క్ ఫ్రంహోంలో ఉండి పనిచేసుకుంటుంటే అమ్మడు ఊరుకునేదే కాదంట. ఆయన దగ్గరగా వచ్చి గట్టిగా పాటలు పెట్టి, డ్యాన్స్‌లు చేసేది. ఏమైనా అంటే కరిచినంత పనిచేసేదంట. చనిపోతానని బెదిరించేదంట. తనకు డబ్బులిస్తేనే సరి లేదంటే.. అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగేదంట.
Bengaluru News: ఓరి నాయనా.. అని ఇక లాభం లేదు విడాకులే శరణ్యమని భావించాడంట ఆ యువకుడు. ఇదే విషయాన్ని ఆమెతో చెప్పగానే కండ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చి పడేసిందంట. ఏమిటో తెలుసా.. విడాకులు తీసుకోవాలంటే తనకు రూ.45 లక్షల పరిహారం ఇవ్వాలని, ప్రతి నెలా భరణం కింద పెద్ద మొత్తం ఇవ్వాల్సిందేనని చావుకబురు చల్లగా చెప్పేసింది. అంతడబ్బును తానెక్కడ తెచ్చి ఇచ్చేది అనుకోవడం ఆ యువకుడి వంతయింది.
Bengaluru News: ఇదేకాకుండా వీరిద్దరూ మాట్లాడుకున్న ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. ఇవన్నీ ఆ యువతి చేయడానికి ఆమె తల్లిదండ్రలు ఇచ్చిన అలుసే కారణమని ఆ యువకుడు వాపోతున్నాడు. వారి వారించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని, ఏదో తెలియని అనారోగ్యాం ఆమెలో ఉన్నట్టు ఆ యువకుడు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇవన్నీ భరించలేని ఆయువకుడు ఏకంగా బెంగళూరు వయ్యలికావల్ పోలీస్‌స్టేషన్ తన భార్య వేధింపులు తట్టుకోలేపోతున్నానని ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో ఉన్నది.