Bengaluru: రోజురోజుకు క్షీణిస్తున్న మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు ఎలా తెగిపోతున్నాయో తెలియజేసే మరో దారుణ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఒక ఇల్లాలు తన కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ ఘటన ప్రస్తుతం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.
ఏం జరిగింది?
బెంగళూరులోని మాగడి ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ (39), ధనంజయ చిన్ననాటి స్నేహితులు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా వీరి స్నేహం కొనసాగింది. పదేళ్ల క్రితం ఆశా అనే యువతిని విజయ్ వివాహం చేసుకుని కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. అయితే, ఇటీవల కాలంలో విజయ్ భార్య ఆశా, అతని స్నేహితుడు ధనంజయతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది.
ఒకసారి, ఆశా, ధనంజయ ఏకాంతంగా ఉన్నప్పుడు విజయ్ వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అంతేకాకుండా, వారిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా విజయ్‌కు దొరికాయి. దీంతో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవల కారణంగా భార్యను తీసుకుని విజయ్ కుమార్ కడబగెరె ప్రాంతంలోని మాచోహళ్లిలో అద్దె ఇంటికి మారారు.
స్థలం మారినా మారిన మనసులు
అయినా కూడా, ఆశా-ధనంజయల మధ్య సంబంధం ఆగలేదు. ఇద్దరూ రహస్యంగా కలుస్తూనే ఉన్నారు. వారి అక్రమ సంబంధానికి భర్త విజయ్ అడ్డుగా ఉన్నాడని భావించారు. తమ సుఖానికి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కలిసి కుట్ర పన్నారు.
Also Read: Crime News: బాలుడిని కొరికి చంపిన.. ఎలుగుబంటి
ఈ కుట్రలో భాగంగా, మాచోహల్లిలోని డీ-గ్రూప్ లేఅవుట్ దగ్గర విజయ్ శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇది హత్యే అని నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో బయటపడిన నిజం
పోలీసుల విచారణలో ఆశా-ధనంజయ అక్రమ సంబంధం గురించి బయటపడింది. ఆశా మరియు ధనంజయ ఇద్దరూ కలిసి విజయ్‌ను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం ఆశా పోలీసుల అదుపులో ఉండగా, ఆమె ప్రియుడు ధనంజయ పరారీలో ఉన్నాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగానే విజయ్‌ను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు.