Bengaluru

Bengaluru: ఇన్ఫోసిస్ లో దారుణం: వాష్‌రూమ్‌లో మహిళా ఉద్యోగులకు మైండ్ బ్లాక్ అయిన సంఘటన!

Bengaluru: బెంగళూరులోని ఇన్ఫోసిస్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా ఉద్యోగి వాష్‌రూమ్‌లో ఉండగా, రహస్యంగా ఆమెను వీడియో తీయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పట్టుకుని, పోలీసులు అరెస్ట్ చేశారు.

జూన్ 30న ఈ ఘటన జరిగింది. 35 ఏళ్ల మహిళా ఉద్యోగి వాష్‌రూమ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, బాత్‌రూమ్ తలుపుపై ఒక ప్రతిబింబం కనిపించింది. అది ఏమిటో అర్థంకాక జాగ్రత్తగా గమనించగా, పక్క స్టాల్ నుంచి ఒక వ్యక్తి తన ఫోన్‌తో వీడియో తీస్తున్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె కమోడ్‌పైకి ఎక్కి చూసినప్పుడు, ఆ వ్యక్తి ప్యాంట్ విప్పి అక్కడ నిలబడి ఉన్నాడు. తీవ్ర భయంతో ఆమె వాష్‌రూమ్ నుంచి కేకలు వేస్తూ బయటికి వచ్చి, తన సహోద్యోగులకు విషయం చెప్పింది. వెంటనే అప్రమత్తమైన సహోద్యోగులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

నిందితుడిని ముంబైకి చెందిన స్వప్నిల్ నాగేష్ మాలీ (30)గా గుర్తించారు. ఇతను మూడు నెలల క్రితం ఇన్ఫోసిస్‌లో సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్‌గా చేరాడు. సహోద్యోగులు అతని ఫోన్‌ను పరిశీలించగా, బాధితురాలి వీడియోతో పాటు మరో మహిళా ఉద్యోగికి సంబంధించిన అభ్యంతరకర వీడియో కూడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఇంటర్నెట్ నుండి డౌన్‌లోడ్ చేయబడిన 50కి పైగా అశ్లీల వీడియోలు కూడా అతని ఫోన్‌లో లభ్యమయ్యాయి.

Also Read: GST Reduction: మిడిల్‌క్లాస్‌కు గుడ్‌న్యూస్.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు!

Bengaluru: బాధితురాలు తన భర్త సహాయంతో కంపెనీ HR విభాగానికి తెలియజేసి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు పోలీసులు స్వప్నిల్ నాగేష్ మాలీపై బీఎన్‌ఎస్ సెక్షన్ 77 తో పాటు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ కంపెనీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు, పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *