Tulsi Leaves Benefits: తులసి సర్వరోగ నివారిణి. ఇది శారీరక, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మతం, సైన్స్ రెండింటి దృక్కోణం నుంచి ఇది మంచిది. తులసి పూజ వల్ల ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటాయి. అదనంగా ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ పిల్లలకు జలుబు, జ్వరం వచ్చినప్పుడు తలసిని కషాయం రూపంలో ఇస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా దీని ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తింటారు. కానీ ఈ విధానం హానికరమని నిపుణులు చెబుతున్నారు. తలసిని నమలి తినడం వల్ల చాలా ప్రమాదాలు వస్తాయని అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
తులసి ఆకులను ఎందుకు నమలకూడదు?
తులసి ఆకులు పాదరసం వంటి అంశాలను కలిగి ఉంటాయి. ఇది నోటి ఆరోగ్యానికి హానికరం.
ప్రతిరోజూ తులసి నమలడం వల్ల అది దంతాల ఎనామిల్‌ను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల దంతాలు సున్నితంగా మారుతాయి. అలాగే దీని ఆకుల తేలికపాటి ఘాటు నోటిలో చికాకు, పుండ్లను కలిగిస్తుంది.
ఆకులను నమలడానికి బదులుగా మీరు వాటి కషాయాలను లేదా రసాన్ని త్రాగాలి. తులసి నీటిలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది దంతాలకు హాని కలిగించదు.
తులసికి దేవత హోదా ఇవ్వబడింది. అందుకే దాని వినియోగం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. తులసిని నమలడం లేదా కోయడం కంటే దానిని మింగాలి. దాన్ని పళ్ళతో కొరికితే అవమానం అంటారు.
ఇది కూడా చదవండి: Ginger And Honey Benefits: అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా..!

