Bellamkonda Srinivas: మంచు మనోజ్, నారా రోహిత్ తో కలసి బెల్లంకొండ శ్రీనివాస్ ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. తమిళంలో రూపొంది విజయం సాధించిన ‘గరుడన్’కి రీమేక్ ఇది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘భైరవం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. స్నేహం, నమ్మకం, విశ్వాసం, ద్రోహం వంటి అంశాలతో ముడిపడి రూపొందుతున్న సినిమా ఇది. తెలుగు నేటివిటీ కి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. తమిళంలో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మించటం విశేషం. తెలుగులో ‘నాంది, ఉగ్రం’ సినిమాలకు దర్శకత్వం వహంచిన విజయ్ కనక మేడల దర్శకత్వం వహించటంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ల కలయిక సినిమా మీద భారీ అంచనాలను పెంచుతోంది. మరి ఆ అంచనాలను ‘భైరవం’ ఎంత వరకూ రీచ్ అవుతుందో చూడాలి.

