Bellamkonda Sai Srinivas: టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ వద్ద శ్రీనివాస్ రాంగ్‌రూట్‌లో కారును నడిపాడు. అదే సమయంలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పైకి కారుతో దూసుకొచ్చాడు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపి నిలదీయడంతో శ్రీనివాస్ వేగంగా వెళ్లిపోయాడు.
Bellamkonda Sai Srinivas: కారుతో హల్‌చల్ చేసిన ఘటనపై బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. కానిస్టేబుల్‌పై దుర్భాషలాడినట్టు తేలడంతో పాటు కారును రాంగ్‌రూట్‌లో నడిపినందుకు ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వచ్చిన వీడియో గత రెండు రోజులుగా వివిధ సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది.