Viral News: సెక్స్ వర్కర్ల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్స్ వర్క్’ నేరం కాదని వారికి ఆరోగ్యy, జీవిత బీమా, ప్రసూతి సెలవులు, సిక్ హాలిడేస్.. మొదలైనవి అమలుచేస్తు అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇంతకు అక్కడ అనుకుంటున్నారా.. అయితే పూర్తిగా చదవండి..
సెక్స్ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు.. అమలుజేయాలని పేర్కొంటూ ఆ దేశం చేసిన చట్టం ఆదివారం(డిసెంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది.ఉపాధి పొందే హక్కు సహా సామాజిక, కార్మిక హక్కులను గుర్తిస్తూ.. ప్రపంచంలోనే ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా బెల్జియం నిలిచింది.
‘సెక్స్ వర్క్’ నేరం కాదని 2022లోనే పేర్కొన్న బెల్జియం, తాజా చట్టంతో ఇతర వృత్తులకు సమానంగా సామాజిక, కార్మిక హక్కుల్ని వారికి కల్పించింది.దీంతో ఇకపై ఏజెన్సీలు(యాజమాన్యాలు) వారికి ఆరోగ్య, జీవిత బీమా, ప్రసూతి సెలవులు, సిక్ హాలిడేస్.. మొదలైనవి అమలుజేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ చట్టంపై ప్రజలు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఒకరు మంచి చట్టం అంటే మరొకరు కాదని కామెంట్ చేస్తున్నారు.