Beef Ban In Assam

Beef Ban In Assam: అస్సాం లో బీఫ్ పై నిషేధం

Beef Ban In Assam: అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో గొడ్డు మాంసం తినడం,వడ్డించడంపై నిషేధం విధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, ‘ఏ రెస్టారెంట్, హోటల్ లేదా పబ్లిక్ ఫంక్షన్‌లో గొడ్డు మాంసం వడ్డించరాదని లేదా తినకూడదని  నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పీయూష్‌ హజారికా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి, లేదంటే పాకిస్థాన్‌కు వెళ్లాలి అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై కాంగ్రెస్‌ స్పందించలేదు.

రాష్ట్ర ప్రభుత్వం 2021లో అస్సాం పశువుల సంరక్షణ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం, ఏ ఆలయానికైనా  5 కిలోమీటర్ల పరిధిలో గొడ్డు మాంసం తినడం, అమ్మడం నిషేధించారు. అయితే అస్సాం క్యాబినెట్ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని విస్తరించింది.

ఇది కూడా చదవండి: Uttarakhand: హవ్వ..! పాతికేళ్ల టీచర్. . మైనర్ బాలునితో అలా..

Beef Ban In Assam: అస్సాంలోని సంగురి అసెంబ్లీ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరిగింది. నవంబర్ 23న ఫలితాలు వెలువడగా, కాంగ్రెస్ అభ్యర్థి తంజీల్ హుస్సేన్ ఓడిపోయారు. బీఫ్‌ను బీజేపీ విభజించిందని తంజీల్ తండ్రి, కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ ఆరోపించారు.

నవంబర్ 30న సీఎం శర్మ స్పందిస్తూ, ‘కాంగ్రెస్ నాకు లిఖితపూర్వకంగా సూచన ఇస్తే, రాష్ట్రంలో గోమాంసాన్ని నిషేధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి సమాధానం రాకముందే గోమాంసాన్ని నిషేధిస్తూ శర్మ నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *