IPL 2025: భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఐపీఎల్ 2025 18వ సీజన్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. గత వారం మే 7న ఆపరేషన్ సింధూర్ నిర్వహించబడిన తరువాత, భారత పాక్షిక సరిహద్దులపై పాకిస్తాన్ దాడులూ, ఆంక్షలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంతో, బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఐపీఎల్ 2025 నిర్వహణ గురించి శుక్రవారం ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది.
గత వారం , పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ధర్మశాలలో అకస్మాత్తుగా రద్దు చేయబడింది. ఇది ప్రేక్షకులు, ఆటగాళ్ల భద్రతను కాపాడుకునేందుకు తీసుకున్న నిర్ణయమని అధికారులు తెలిపారు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 10.1 ఓవర్లలో ఉండగానే ఫ్లడ్ లైట్లను ఆపేశారు, దాంతో మ్యాచ్ నిలిపివేయబడింది. ఆటగాళ్లను, ప్రేక్షకులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఒక ప్రకటనలో, “పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు చేయడం, స్టేడియం ఖాళీ చేయడం జరిగింది. శుక్రవారం జరిగే సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణ, భద్రతా పరిస్థితులు, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుంది. ప్రస్తుతానికి, ఆటగాళ్ల భద్రతే మా ప్రాధాన్యత.” అని తెలిపారు.
Also Read: India-Pakistan Conflict: సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం
IPL 2025: ఇప్పటికే, బీసీసీఐ ధర్మశాలలో చిక్కుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జట్టుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, వాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నిర్ణయించుకున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు.
ఐపీఎల్ 2025 సీజన్‌పై భవిష్యత్తులో ఏమైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే, వాటిని బీసీసీఐ శుక్రవారం జరిగిన సమావేశంలో తీసుకోనుంది. ప్రస్తుతం, ఈ కీలక నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకునే ముందు భద్రతా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం అవశ్యకమైంది.
