BCCI -Team India: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, బీసీసీఐ ప్లేయర్స్ మరియు స్టాఫ్‌కు సంబంధించిన కఠినమైన నియమాలను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బీసీసీఈ ఈ నియమాలపై కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి, క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను పర్యటనల్లో తీసుకెళ్లడం గురించి కొంత సడలింపు చేసింది. ఎంతైనా కోట్ల మంది ప్రేక్షకులు ఎంతో అభిమానం గా కొలిచే స్టార్ క్రికెటర్లు మరి. ఎంత ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ అయినా కొద్దిగా వెనక్కి తగ్గక తప్పదు అన్నట్లు ఉంది వ్యవహారం ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
వరుసగా జరిగిన పర్యటనల్లో టీమ్ ఇండియా విఫలమైన తర్వాత, ఆస్ట్రేలియా టూర్ తర్వాత క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లకూడదని బీసీసీఐ నిబంధనలు విధించింది. ఈ నిబంధనకు క్రికెట్ ప్రపంచంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ నియమానికి మద్దతు తెలిపగా, మరికొందరు ఇది సరైనది కాదని వాదించారు.
కొందరు భార్య మరియు పిల్లల నుండి నెలల తరబడి దూరంగా ఉండటం క్రికెటర్లకు కష్టంగా ఉంటుందని అన్నారు. మరికొందరు అలా దూరంగా ఉండటం వల్ల క్రికెటర్లు ఆటపై మరింత దృష్టి పెడతారని వాదించారు. అయినప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి “నో ఫ్యామిలీ రూల్”ను పాటించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: ICC Champions Trophy 2025: పాకిస్తాన్ తో మళ్లీ వివాదం..! భారత జెండా పెట్టాల్సిందే అంటున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
అయితే, ఇప్పుడు బీసీసీఈ ఈ “నో ఫ్యామిలీ రూల్”పై కొంత వెనక్కి తగ్గింది. ఆటగాళ్లకు కొంత ఊరటనిచ్చే విధంగా ఈ నియమాన్ని సడలించింది. దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అయితే, ఈ అనుమతికి ఒక షరతు ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌కు మాత్రమే క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి బీసీసీఈ అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ప్రయోజనం కోసం క్రికెటర్లు ముందుగా బోర్డుకు అభ్యర్థన చేసుకోవాలి. అప్పుడు బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తుందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
అయితే అంతేకాకుండా విరాట్ కోహ్లీ తనతో పాటు తన సొంత వంట గాడిని కూడా తెచ్చుకుంటాడని పలువురు చెప్తున్నారు. ఇక ఇలా సొంతంగా వంట వాళ్లను, అధిక లగేజీ బ్యాగ్‌లను తెచ్చుకోవడానికి కూడా బిసిసిఐ నిషేదించింది. మరి రాబోయే రోజుల్లో స్టార్ ప్లేయర్ల నుండి మరిన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి. అప్పుడు బీసీసీఐ ఇలాగే కఠినంగా వ్యవహరిస్తుందా లేదా ప్రదర్శన మెరుగయ్య కొద్దీ అంశాల నుండి వెసులుబాటు కలిపిస్తుందా అన్న విషయం వేసి చూడాలి.