BCCI: 2025 ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొనదన్న వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బోర్డు కార్యదర్శి **దేవజిత్ సైకియా** స్పష్టం చేశారు.
ఆసియా కప్ లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి భారత్ వైదొలగిందని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన పూర్తిగా ఖండించారు. ఈ విషయంపై ఇప్పటివరకు బోర్డు ఏ విధమైన చర్చలు జరపలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
“ప్రస్తుతం బీసీసీఐ మొత్తం దృష్టి ఐపీఎల్ 2025 సీజన్ మరియు ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌పైనే ఉంది. ఆసియా కప్‌పై బోర్డు సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదు,”** అని దేవజిత్ సైకియా తెలిపారు.
అలాగే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించే టోర్నీలపై భవిష్యత్తులో చర్చలు జరిగే అవకాశముందని, అప్పుడు అవసరమైన ప్రకటనను అధికారికంగా విడుదల చేస్తామని చెప్పారు.
వాస్తవం లేని ఊహాగానాలు, కల్పిత కథనాలను నమ్మకుండా, అధికారిక సమాచారం కోసం ఎదురుచూడాలని క్రికెట్ అభిమానులకు ఆయన సూచించారు.

