BC Reservation Ordinance: బీసీ రిజర్వేషన్ పెంపు ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డైలమాలో ఉన్నట్టు అర్ధమవుతున్నది. ఆర్డినెన్స్ ఆమోదంపై అధికారులతో విస్తృతంగా చర్చించిన గవర్నర్.. న్యాయ సలహా కోరినట్టు తెలుస్తున్నది. దీంతో ఆర్డినెన్స్ అంశంపై కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తన్న రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం.
BC Reservation Ordinance: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు లక్ష్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఇటీవల రూపొందించగా, మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించారు. అనంతరం ఆ బిల్లును చట్టం చేసేందుకు పార్లమెంటుకు పంపగా, అక్కడ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
BC Reservation Ordinance: ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా, ఇంకా ఆమోదం లభించలేదు. న్యాయసలహా, ఇతర రాష్ట్రాల అధ్యయనం చేయాలన్న గవర్నర్ నిర్ణయంతో జాప్యం జరిగే అవకాశం ఉన్నది. న్యాయ చిక్కులు లేకుండా చూడాలని చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
BC Reservation Ordinance: స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఒకవేళ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచితే ఆ పరిమితి 67 శాతానికి వెళ్తుంది. అంటే బీసీలకు 42 శాతంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లతో 50 శాతం పరిమితి దాటుతుంది. దానిపై గవర్నర్ వర్గాలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తున్నది.
BC Reservation Ordinance: ఈ దశలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్లు ఒక నెలలోపు ఆమోదించాలి. లేదా తిరిగి శాసనసభకు పంపాలి. ఒకవేళ శాసనసభకు పంపాలని అనుకుంటే వెంటనే పంపుతుంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే అక్కడ ఉన్న రాష్ట్ర బిల్లులతో కలిపి ఇది మూడో బీసీ బిల్లు అవుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందితేనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలవుతుంది.