Jupally Krishna Rao

Jupally Krishna Rao: ఈ సారి అంగరంగ వైభవంగా.. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు

Jupally Krishna Rao: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు ఈ నెల 22 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

ఈ వేడుకల్లో భాగంగా, ఈ నెల 27న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివాల్ నిర్వహిస్తారు. అలాగే, ఈ నెల 28న 10 వేల మంది మహిళలతో బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి. ఈ నెల 29న పీపుల్స్ ప్లాజా వద్ద బతుకమ్మ పోటీలు ఉంటాయని మంత్రి జూపల్లి వెల్లడించారు. ఇక, ఈ నెల 30న బతుకమ్మ పరేడ్ నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కోరారు. ప్రభుత్వం ఈ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *