Vemulawada: వేములవాడ లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను మున్సిపల్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. పట్టణ శివారులోని మూల వాగు బతుకమ్మ తిప్ప వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. 30 లక్షల తో మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ వేడుకలకు రండి అంటూ పలువురు ప్రముఖులను రాజకీయ నాయకులను అధికారులను మున్సిపల్ కౌన్సిలర్లు ఆహ్వానించారు.
వేములవాడలో ఏడు రోజులకు జరుపుకునే సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులను ఆహ్వానించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ నాదురుతపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ పరిధి తిప్పాపూర్, కొడబుంజ, అనుపురం, శాభాష్ పల్లి, కొనాయిపల్లిలో సద్దుల బతుకమ్మవేడుకలు జరగనున్నాయి.

