Barrelakka: నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు

Barrelakka: తెలుగు రాష్ట్రాల్లో “బర్రెలక్క”గా ప్రాచుర్యం పొందిన కర్నె శిరీష మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించిన ఆమె, తాజాగా తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ఓ భావోద్వేగపూరిత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ పెరుగుతున్నాయని శిరీష వాపోయారు. ఇటీవల జరిగిన తన వివాహం సంబంధించి కూడా అసభ్యమైన వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో తాను తీవ్రంగా వేధింపులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు?” అంటూ ఆమె కన్నీటితో ప్రశ్నించారు. పరిచయం కూడా లేని వ్యక్తులు తన స్నేహితులమని చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“పెళ్లి చేసుకోకపోతే ఇంకా ఇలాగే ట్రోల్స్ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేస్తారన్న భయంతోనే పెళ్లి చేసుకున్నాను. నిజానికి నాకు పెళ్లి చేయాలనే ఆసక్తి లేదు. ఒక్క ఏడాది ఆగుదాం అనుకున్నాం. కానీ విమర్శలు, నిందల మధ్య మనశ్శాంతి కోల్పోతానేమోనన్న ఆందోళనతో పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయినా సంతోషం లేకుండా, ట్రోల్స్ వల్ల మానసికంగా చాలా బాధపడ్డాను. నేను ఎవ్వరినీ నిందించను. అన్నీ దేవుడు చూస్తున్నాడు. కర్మ ఎవరినీ వదలదు,” అంటూ శిరీష వాపోయారు.

ఆమె చెప్పిన ఈ మాటలు ఎంతోమందికి చింతన కలిగించేలా ఉన్నాయి. ట్రోలింగ్ అనే పేరుతో వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపడం సమాజంగా మనం ఆలోచించాల్సిన విషయం.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *