Banglore: బెంగళూరులో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోతే కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే
బెంగళూరులోని ఓ బస్సు డిపోలో డ్రైవర్గా చేస్తున్న కిరణ్ అనే వ్యక్తి నేలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై డ్రైవింగ్ సీట్లోనే స్పృహతప్పి పడిపోయాడు. బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో బస్సు ని ఢీ కొట్టింది. బస్సులోని ప్రయాణికులు కంగారు పడగా కండక్టర్ అప్రమత్తమయ్యాడు. డ్రైవర్ను లేపే ప్రయత్నం చేశాడు. కానీ అతను స్క్రోకోల్పోవడంతో పక్కకు లాగేసాడు. డ్రైవింగ్ సీట్లో తను కూర్చుని బస్సును బ్రేక్ వేసి ఆపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.