IND vs BAN 2nd T20: టీమిండియా బ్యాటింగ్.. సంజూ శాంసన్ ఔట్

IND vs BAN 2nd T20: భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ జరగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్(10) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో 17 పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఓపెనర్ అభిషేక్ శర్మ(15), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0)లు క్రీజులో ఉన్నారు.మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.

కాగా, గ్వాలియర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(w), నజ్ముల్ హొస్సేన్ శాంటో(c), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *