Bandla Ganesh: తెలుగు సినీ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ మధ్యకాలంలో తరచూ సినిమా ఈవెంట్లలో కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మాట్లాడే విధానం కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నా, అప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు మాత్రం అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా, స్టార్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) మరియు రాజీవ్ కనకాల (Rajiv Kanakala) తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’ (Mogili) పై బండ్లన్న తనదైన శైలిలో స్పందించారు.
శనివారం (డిసెంబర్ 13)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మోగ్లీ’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) రూపొందించిన ఈ చిత్రంలో సాక్షి అనే నూతన నటి హీరోయిన్గా పరిచయమైంది. మొదటి రోజు రూ.1.20 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun) సహా పలువురు సినీ ప్రముఖులు ‘మోగ్లీ’ టీమ్‌కు అభినందనలు తెలియజేస్తూ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Murder: పహాడీ షరీఫ్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?
ఈ క్రమంలోనే బండ్ల గణేష్ సైతం ట్విట్టర్ వేదికగా ‘మోగ్లీ’ సినిమాపై తన సుదీర్ఘ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాకు వస్తున్న ‘వైల్డ్ బ్లాక్‌బస్టర్’ అనే ట్యాగ్‌లైన్‌ను మొదట తాను పెద్దగా పట్టించుకోలేదని, అది కేవలం పోస్టర్ మాటలే అనుకున్నానని బండ్లన్న తెలిపారు.
#Mowgli 🔥
“వైల్డ్ బ్లాక్‌బస్టర్” ట్యాగ్ చూశాక అనుకున్నా…
పోస్టర్ మాటలే, సినిమా వేరేలా ఉంటుందేమో అని 😜
కానీ సినిమా చూసాక అర్థమైంది ,పోస్టర్ ఇంకా సాఫ్ట్ గా ఉందని!ప్రత్యేకంగా చెప్పాలి మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్ లో అనుకున్నా…
కాని స్క్రీన్ మీద చూసాక అర్థమైంది ,Roshan…— BANDLA GANESH. (@ganeshbandla) December 13, 2025
నటుడు పుట్టాడు!.. రోషన్‌పై బండ్లన్న ప్రశంస
‘మోగ్లీ’ సినిమా చూశాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే… వైల్డ్ బ్లాక్‌బస్టర్ ట్యాగ్ చూశాక అనుకున్నా… పోస్టర్ మాటలే, సినిమా వేరేలా ఉంటుందేమో అని. కానీ సినిమా చూసాక అర్థమైంది, పోస్టర్ ఇంకా సాఫ్ట్‌గా ఉందని! ప్రత్యేకంగా చెప్పాలి. మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్ లో అనుకున్నా… కానీ స్క్రీన్ మీద చూసాక అర్థమైంది, రోషన్ కనకాల అనే నటుడు పుట్టాడు! ఇది అతని రెండో సినిమా. రోషన్ నటనను బండ్లన్న ఇలా ప్రశంసించడం విశేషం.
కథ, కథనం, టెక్నీషియన్స్ గురించి…
-
సందీప్ రాజ్ దర్శకత్వం: దర్శకుడు సందీప్ రాజ్ రైటింగ్, మాటల్లోని సింప్లిసిటీ, సీన్స్ లో క్లారిటీ గురించి బండ్ల గణేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
-
బండి సరోజ్ కుమార్ విలనిజం: బండి సరోజ్ కుమార్ విలనిజం… విలన్ కదా అని ఎక్కువ చేయలేదు. అదే ఎక్కువ అయ్యింది అంటూ విలన్ పాత్ర చిత్రీకరణను మెచ్చుకున్నారు.
-
సాక్షి అమాయకత్వం: హీరోయిన్ సాక్షి అమాయకత్వం సినిమాకి చక్కని బ్యాలెన్స్ అని అభిప్రాయపడ్డారు.
-
కాల భైరవ సంగీతం: కాల భైరవ మ్యూజిక్ సీన్ కి అవసరమైన చోటే వచ్చి పని చేసిందని మెచ్చుకున్నారు.
-
నిర్మాత విశ్వప్రసాద్: విశ్వప్రసాద్ గారి సినిమా టేస్ట్ టేస్ట్ అంటే ఇదే అని మళ్లీ గుర్తు చేశారు! అని నిర్మాణం గురించి బండ్లన్న సంతృప్తి వ్యక్తం చేశారు.
చివరగా, “మోగ్లీ సినిమా చూసాక ‘వైల్డ్’ అనే మాటకి అర్థం అప్డేట్ అయింది! కంగ్రాట్స్ టీమ్ మోగ్లీ. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. మనం థియేటర్ లో నవ్వుతూ బయటకి రావాలి” అంటూ బండ్ల గణేష్ తన రివ్యూను ముగించారు. మొత్తానికి, రోషన్ కనకాలకు నటుడిగా మంచి భవిష్యత్తు ఉందని బండ్లన్న ఇచ్చిన కితాబు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
