Bandi sanjay: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీస్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే నోటీసులు పంపారని తెలిపారు. నీకు కూడా నోటీస్ పంపుతా.. కాచుకో కేటీఆర్.. అని బండి సంజయ్ ప్రతి సవాల్ విసిరారు. కేటీఆర్, బండి సంజయ్‌ల నోటీసుల వార్ ఎంతవరకు దారితీస్తున్నదోనని రాజకీయ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది.
