bandi-sanjay

Bandi Sanjay: నిజం సింహం లాంటిది.. లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay:తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కేటీఆర్‌ పంపిన లీగల్‌ నోటీసులపై ఘాటుగా స్పందించారు. “నిజం సింహం లాంటిది.. దాన్ని ఎవరూ ఆపలేరు. నోటీసులు పంపడం చూసి భయపడతామనుకోవద్దు” అని స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అడ్డగోలు, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ కేంద్రమంత్రి బండి సంజయ్‌కి లీగల్‌ నోటీసు పంపించారు.

కేటీఆర్‌ న్యాయవాదులు పంపిన నోటీసులో — ప్రజాప్రతినిధి అయిన బండి సంజయ్‌కి బాధ్యతాయుతంగా మాట్లాడే బాధ్యత ఉందని, కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రజల ముందే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే భవిష్యత్తులో ఇటువంటి అడ్డగోలు, తప్పుడు ఆరోపణలు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందులో క్రిమినల్‌ కేసులు కూడా ఉంటాయని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం బండి సంజయ్‌ పార్లమెంట్‌ సమావేశాలతో బిజీగా ఉన్నారు. కేటీఆర్‌ నోటీసుకు ఆయన ఎలా స్పందిస్తారో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ram mohan Naidu: విగ్రహాలు మాత్రమే కాదు… ప్రజలు కూడా మారాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *