తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడబెట్టినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోందని ఆరోపించారు.
సోమవారం కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడి పోరాడతామని తెలిపారు. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడంపై స్పందిస్తూ.. ఈ తరహా వారసత్వ రాజకీయాలు ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదని, వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.