Bandi sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటానని స్పష్టంచేశారు. కేటీఆర్ వలె ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదని, రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొంటానని ఆయన పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో బహిరంగ క్షమాపణతో పాటు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణకు డిసెంబర్ 15న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.