Bandi sanjay: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతను సంతరించుకుంది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పరిణామాలపై ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. “మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని మాపై బురదజల్లుతారా?” అంటూ సీఎం రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు.
అలాగే, “దమ్ముంటే BRS స్కాంలను CBIకి అప్పగించాలి. సీబీఐకి అప్పగిస్తే దోషులందరినీ లోపల వేస్తాం” అంటూ బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన స్కాంలపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
ఇక, రేవంత్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. “సర్వేలన్నీ కాంగ్రెస్‌కు మూడో స్థానమేనని తేల్చాయి. సర్కార్‌కు ఢోకా లేకుంటే ప్రచారానికి ఎందుకు వచ్చారు?” అని సీఎం రేవంత్‌ను నిలదీశారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ నాయకుల మధ్య మాటల తూటాలు మరింత ముదురుతుండటం గమనార్హం.