Bandi sanjay: 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది

Bandi sanjay: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటు 61 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పరిణామంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొంటూ –> “ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢమైన సంకల్పానికి నిదర్శనం. ఆయన అనుకున్నట్లుగానే 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది. అంతర్గత భద్రతపై అమిత్ షా రాజీలేని ధోరణి, దృఢమైన చర్యలు ఇప్పుడు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి,” అన్నారు.

అంతేకాక> “ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో దేశంలో శాంతి, భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ లొంగుబాట్లు ఆ దిశగా మరో పెద్ద అడుగు. ఇకనైనా మావోయిస్టులు ఆయుధాలను వదిలి ప్రధాన స్రవంతిలోకి రావాలి. మావోయిస్టు నెట్‌వర్క్ కూలిపోతోంది. ప్రాణాలను ప్రమాదంలోకి తెచ్చుకోవద్దని వారిని కోరుతున్నాను,” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *