Band Melam

Band Melam: బ్యాండ్ మేళం’ ఫస్ట్ బీట్ (టైటిల్ గ్లింప్స్) రిలీజ్

Band Melam: ‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ ఓ అందమైన ప్రేమ కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ క్యూట్ కాంబోని బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. శివరాజు ప్రణవ్ ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు. “ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్” అనేది ఉప శీర్షిక. టైటిల్ గ్లింప్స్‌ను ఫస్ట్ బీట్ అంటూ రిలీజ్ చేశారు.

తెలంగాణ యాసలో విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన అందమైన ఓ జానపద గీతంతో గ్లింప్స్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ బీట్‌లో యాదగిరి (హర్ష్ రోషన్) తన ప్రేయసి రాజమ్మ (శ్రీదేవి అపల్ల) కోసం ఇంట్లోకి వచ్చి వెతుకుతుంటాడు. తెలంగాణ యాసలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక చివర్లో అయితే హార్ట్ టచింగ్ ఎమోషన్, మ్యూజిక్‌తో టైటిల్ గ్లింప్స్ అందరినీ కదిలించేలా ఉంది. ఈ టైటిల్ గ్లింప్స్ చూసిన తరువాత ఓ అందమైన గ్రామీణ ప్రేమ కథను తెరపై చూడబోతోన్నామనే ఫీలింగ్ మాత్రం అందరిలోనూ కలిగింది.

ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన గీత రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. శివ ముప్పరాజు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అద్భుతమైన సాంకేతిక బృందం, భారీ తారాగణంతో, మ్యూజికల్, ఎమోషనల్ జర్నీగా అందమైన ప్రేమ కథను త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు.

తారాగణం: రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు

సాంకేతిక బృందం:
ఏ కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ : మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు : కావ్య, శ్రావ్య
సహ నిర్మాత : శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు : సతీష్ జవ్వాజీ
సంగీతం : విజయ్ బుల్గానిన్
స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ : శివ ముప్పరాజు
డిఓపి : సతీష్ ముత్యాల
గీత రచయిత : చంద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ నార్ని
మార్కెటింగ్ : వాక్డ్ అవుట్ మీడియా
పీఆర్వో : వంశీ కాకా

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *