Band Infusion: భారతదేశంలోనే అత్యంత బ్యాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందిన బ్యాండ్ ఇన్ఫ్యూజన్ సంస్థ ప్రపంచ దేశాల్లోనూ సత్తా చాటుతున్నది. మనదేశంలో 1,000కి పైగా విశేష ప్రదర్శనలు ఇచ్చి విశేష ప్రతిభను చాటింది. ప్రముఖులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఈ బ్యాండ్ ఇన్ఫ్యూజన్ సంస్థ ప్రసిద్ధి చెందింది. వివిధ వేదికలల్లో అత్యంత శక్తివంతమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది. ప్రస్తుతం యూనివర్సల్ రెడ్ కార్పెట్ (యూఆర్‌సీ) అనే సంస్థతో కలిసి బ్యాండ్ ఇన్ఫ్యూజన్ సంస్థ విదేశాల్లో అనేక ప్రదర్శనలిస్తూ విశేష ప్రతిభను చాటుతున్నది. అక్కడి జనాలను సైతం తమ సంగీత మాధుర్యంతో ఓలలాడిస్తున్నది.
బ్యాండ్ ఇన్ఫ్యూషన్ అనే ఈ సంగీత బృందం 2019లో హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. వీరు శాస్త్రీయ సంగీతాన్ని కలిపి సరికొత్త సంగీతాన్ని రూపొందించారు. ఈ సంగీతంతో ఆధునిక పాశ్చాత్య సంగీతంతో కలగలిసిన గాన మాధుర్యాన్ని అందిస్తూ దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఎంతో గుర్తింపు పొందింది. 1,000కు పైగా ప్రదర్శనలు ఇవ్వగా, 50కి పైగా బ్రాండ్ లాంచ్ ఈవెంట్లను నిర్వహించింది.
బ్యాండ్ ఇన్ఫ్యూషన్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లలో అతి ఎక్కువ మందిని రంజింపజేసిన సంస్థగా గుర్తింపు పొందింది. దీంతో దేశంలోనే అతి పెద్ద బ్రాండ్లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ తాజాగా ఓ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నది. బర్బరిక్ అనే కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న దక్షిణభారత బ్యాండ్‌గా ఈ సంస్థ గుర్తింపు పొందింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరగడం విశేషం.
బ్యాండ్ ఇన్ఫ్యూషన్ సభ్యులు.. వారి విశేషాలు
కృష్ణ చైతన్య: ఈ సంస్థలో సభ్యలైన కృష్ణ చైతన్య పురుష వోక్సల్స్‌లలో ఒకరు. ఈయన కర్ణాటక మ్యూజిక్‌లో ఎంఏ పూర్తిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో గాయకుడిగా ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు. ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, థమన్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.
వల్లి గాయత్రి: ఈమె మహిళా వోకల్స్‌లలో ఒకరు. సరిగమప రియాలిటీ షో ద్వారా వల్లి గాయత్రి గుర్తింపు పొందారు. ఆమె థమన్, అనూప్ రూబెన్స్ వంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. యూఎస్ఏలో జరిగే ప్రదర్శనల్లో విశేష ప్రతిభను చాటుతున్నారు.అరవింద్ సొవోజీ: ఈయన కీబోర్డు కళాకారుడు. 2005లో అరవింద్ సొవోజీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం, శంకర్ మహదేవన్ వంటి గాయకుల వద్ద పనిచేస్తూ వందలాది ప్రదర్శనల్లో పాల్గొని విశేష ప్రతిభను చాటుకున్నారు.
సాయి వికాస్: ఈయన లీడ్ గిటారిస్ట్. ఎన్‌కౌంటర్ 777, సనమ్, ఆర్జ్ వంటి ప్రసిద్ధ బృందాలతో కలిసి ప్రదర్శనల్లో పనిచేశారు. ఇప్పుడు తన సొంత స్టైల్‌తో విశేషంగా ప్రేక్షకులను సాయి వికాస్ ఆకట్టుకుంటున్నారు.
విజయ్ నెలపాటి: ఈయన బాస్ గిటార్. హైదరాబాద్ రాక్ మ్యూజిక్ సర్కిల్‌లో విజయ్ నెలపాటి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. అనేక స్టూడియె ప్రోగ్రామ్‌లలో పాల్గొని ప్రతిభను చాటారు.
ప్రేమ్‌కుమార్ బండారు : ఈయన డ్రమ్స్ కళాకారుడు. ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద ప్రాజెక్టుకు కూడా డ్రమ్స్ మాంత్రికుడిగా పనిచేశారు. ఆ సినిమా ద్వారా విశేష ప్రతిభను చాటారు. బాలు వికాస్: ఈయన సౌండ్ ఇంజినీరు, మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇళయరాజా, శ్రేయా ఘోషల్ వంటి ప్రముఖులతో పనిచేశారు.
బ్యాండ్ ఇన్ఫ్యూషన్ కర్ణాటక- వెస్ట్రన్ సంగీతం కలయికతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది. మ్యూజికల్ ఇన్నోవేషన్‌తో సినీరంగంతో కలిసి పనిచేయడం ఈ బ్యాండ్ ప్రత్యేకత. దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇస్తూ ఎందరి నుంచో ప్రశంసలు పొందింది. ఇప్పటికీ విదేశాల్లో యూనివర్సల్ రెడ్ కార్పెట్ (యూఆర్‌సీ) అనే సంస్థతో కలిసి అనేక ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తున్నది.
ప్రస్తుతం యూనివర్సల్ రెడ్ కార్పెట్ (యూఆర్‌సీ) అనే సంస్థతో కలిసి బ్యాండ్ ఇన్ఫ్యూషన్ సంస్థ అనేక ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఉగాండా, యూకే దేశాల్లో ఈ సంస్థ కళాకారులు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం చార్లొట్టె, రాలిఫ్, కొలంబస్, టాంపా, న్యూజెర్సీ, బెంటన్‌వాలీ, పోనెక్స్, అట్లాంటా, డాలస్, ఆస్టిన్ నగరాల్లో యూఆర్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థతో కలిసి బ్యాండ్ ఇన్ఫ్యూషన్ సంస్థ ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నది. ఆయా ప్రాంతాల్లో ప్రేక్షక లోకంలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది.