BAN vs IND T20: బంగ్లాదేశ్ తో జరగనున్న చివరి టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా లో భారీ మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ విక్టరీ అందుకున్న భారత్.. ఉప్పల్ లో జరిగే నామమాత్ర మైన మూడో టీ20 లో ప్రయోగాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
BAN vs IND T20: ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఉప్పల్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ లోనూ విజయంతో బంగ్లా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే సిరీస్‌ను కైవసం చేసుకున్న సూర్య సేన మూడో ట్వంటీ20లో ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఆడని ప్లేయర్లకు అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
BAN vs IND T20: బంగ్లాదేశ్ తో జరిగే ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ యువ పేసర్ హర్షిత్ రాణా టీమిండియా తరపున ట్వంటీ20ల్లో అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన యువబ్యాటర్ తిలక్ వర్మ, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను ఆఖరి మ్యాచ్ లో బరిలోకి దింపాలని కోచ్ గంభీర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరికి అవకాశం కల్పించేందుకు మూడో టీ20 నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ మయాంక్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇస్తారని సమాచారం. హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండడంతో లోకల్ బాయ్స్ తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.