baluchistan: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్ ప్రభుత్వానికి పెద్ద తగిన శిక్షనిస్తున్నది. బలూచిస్తాన్ లోని ప్రాదేశిక ప్రాంతాల్లో బీఎల్ఏ ప్రభావం పెరిగింది. క్వెట్టా రాజధాని తప్ప, ఎక్కువ ప్రాంతాలు పాక్ ప్రభుత్వ నియంత్రణలో లేవు. బీఎల్ఏ పాక్ సైన్యాన్ని టార్గెట్ చేసి తీవ్ర దాడులు చేస్తోంది. తాజాగా, కీలకమైన సురబ్ నగరాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నట్టు ప్రకటించింది.
నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలను బీఎల్ఏ టార్గెట్ చేసి దాడులు నిర్వహించింది. బీఎల్ఏ ప్రకారం, సురబ్ నగరంలోని ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చాయి. ఘర్షణలలో పాక్ సైన్యం, పోలీస్ దళాలను వెనక్కి నెట్టారని తెలిపింది. ఆపరేషన్ సమయంలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను హతమార్చి, పోలీసుల నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకుంది.
బీఎల్ఏ ప్రతినిధి జయంద్ బలూచ్ ప్రకటన ప్రకారం, 40,000 జనాభా ఉన్న సురబ్ పట్టణంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రవాణా మార్గాలను మూసేశారు. శుక్రవారం సాయంత్రం వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై భారీ దాడులు చేసి అనేక అధికారులను బంధీలుగా పట్టుకున్నారు.