balakrishna: ఆపరేషన్ సింధూర్.. వైరల్ అవుతున్న బాలయ్య సినిమా సీన్

balakrishna: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై దేశవ్యాప్తంగా సపోర్ట్ వస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి గట్టి ప్రతీకారం తీర్చిన భారత జవాన్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ భారత సైన్యానికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ మాత్రం ప్రత్యేకంగా ఆకర్షించింది. నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ’ సినిమాలోని ఓ పాపులర్ సన్నివేశాం సోషల్ మీడియాలో ట్రెండ్ అంవుంతోంది.

ఇందులో బాలయ్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించి, ఉగ్రవాదిని ఎదుర్కొని హెలికాప్టర్ నుంచి పాకిస్తాన్ భూభాగంలో పడవేసి కాల్చి చంపుతారు. అనంతరం అతని మృతదేహంపై భారత జెండాను వేయడం, ఆ జెండా రెపరెపలాడటం, బాలయ్య సెల్యూట్ చేయడం హైలైట్‌గా నిలుస్తుంది. ఈ వీడియోతో పాటు “Yes, We Will End” అనే క్యాప్షన్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశభక్తి భావాలు మళ్లీ ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

https://x.com/BheemlaBoy1/status/1920001366690562555?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1920001366690562555%7Ctwgr%5E8679110718d0f5bf981445646d6fe23a49a52f46%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.dishadaily.com%2Fcinema%2Fhero-balayya-film-video-is-going-viral-on-social-media-in-the-wake-of-the-killing-of-terrorists-on-the-indian-border-437029

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *