Daaku Maharaaj

Daaku Maharaaj: గుమ్మడికాయ కొట్టేసిన ‘డాకు మహారాజ్’

Daaku Maharaaj: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘డాకు మహారాజ్’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. హీరో బాలకృష్ణ, దర్శకుడు బాబీ కి ఓ హాస్పిటల్ లో  సీన్ వివరిస్తున్న స్టిల్ ను పోస్ట్ చేస్తూ, ‘ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ముందు అనుకున్నట్టుగానే 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న జనం ముందుకు వస్తున్నట్టు తెలిపింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ తో ఆయనకు ఇది ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటీవల విడుదలై ‘డాకు మహారాజ్’ టీజర్ కు సూపర్ రెస్సాన్స్ లభించడమే కాదు సినిమాపై అంచనాలనూ పెంచేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  rahul gandhi: ఆంగ్ల భాష ఆత్మవిశ్వాసాన్ని, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *