Balakrishna: “ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్యం” అని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. వారి త్యాగాల వల్లనే మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్నారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, త్వరలోనే ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు స్థాపించబడి, యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించబడతాయని తెలిపారు.
తన తండ్రి, దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని చెప్పిన బాలయ్య, “ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం, నేను పూజారి మాత్రమే” అన్నారు. సినీ రంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, మీ ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని చెప్పారు. “నాన్నగారి దీవెనలతోనే మీ అందరి గుండెల్లో నిలిచిపోయాను” అని బాలకృష్ణ పేర్కొన్నారు.