Balagam Mogilaiah: బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు మొగిలయ్య ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అయన కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. అయన వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్ధండి తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది.అతని రెండు అతని రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అనారోగ్యానికి గురయ్యారు. దింతో ఆయనకి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేస్తున్న క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు వచ్చాయి అని కుటుంబ సభ్యులు చెప్పారు.
